టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఆయన సోదరుడు చంద్రశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడికి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ ఉంపుడుగత్తెలా వ్యవహరస్తున్నాడని చంద్రశేఖర్ నిప్పులు చెరిగారు. టీడీపీ ఇచ్చిన 650 హామీల్లో అయిదు హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.

Also Read:నిన్ను అక్కడే కొట్టకపోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళిపోతా.. కొడాలి నాని

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక 18 నెలల్లోనే అన్ని వర్గాలకు సంక్షేమం అందించారని చంద్రశేఖర్ ప్రశంసించారు. సంక్షేమాన్ని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీనియర్‌ రాజకీయ నాయకులని భుజాలు చరుచుకునే చంద్రబాబు.. పేదలకు ఎన్ని పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఒకేసారి లక్షలాది మందికి పట్టాలు ఇస్తుంటే కన్నుకుట్టి రాద్ధాంతం చేస్తున్నారని చంద్రశేఖర్ దుయ్యబట్టారు.

టీడీపీ నేతల ఉత్తర ప్రగల్బాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ విచారణ జరిపించాలని చంద్రశేఖర్‌ కోరారు