మాజీ మంత్రి దేవినేని ఉమాపై పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాని నాని తనదైన శైలిలో మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 

దీక్షకు పోలీసులు ఒప్పుకోరని తెలిసే దీక్ష నాటకమాడిన చవట దేవినేని ఉమా అంటూ ఘాటుగా విరుచుకుపడ్డారు. దేవినేని ఉమకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు..

మీడియా సమక్షంలోనే ఇద్దరి పార్టీల మేనిఫెస్టో గురించి మాట్లాడదాం అంటూ, చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. నిన్ను అక్కడే కొట్టకపోతే నేను రాష్ట్రం విడిచి వెళ్ళిపోతానంటూ చాలెంజ్ చేశారు.

సొల్లు కబుర్లు చెప్పడమే సొల్లు ఉమాపని అంటూ ఎద్దేవా చేశారు. గత రాత్రి నుంచి ఉమాకు పదిసార్లు ఫోన్ చేశా.. బహిరంగ చర్చకు సిద్ధమని చెబుతున్నా.. కానీ నా ఫోన్ కు సమాధానం లేదు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.