అమరావతి: న్యాయమూర్తులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఎవరెవరు భూకబ్జాలు చేశారనే విషయంపై విచారణకు ప్రభుత్వం కమిటీ వేసిందని ఆయన ఆయన చిత్తూరు జిల్లా పుత్తూరులో శుక్రవారం మీడియా సమావేశంలో చెప్పారు.

అమరావతిలో న్యాయమూర్తులు, వారి పిల్లలు కూడా భూములు కొనుగోలు చేశారని, దానిపై విచారణను ఏసీబీకి అప్పగించామని ఆయన చెప్పారు. దానిపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లారని, ఆ వివరాలు ఏవీ మీడియాలో రాకూడదంటూ కోర్టులు ఆంక్షలు విధించిందని ఆయన అన్నారు. 

దేశానికి స్వతంత్రం రాక ముందు కూడా ఈ పరిస్థితి లేదని ఆయన ్న్నారు. తాను కోర్టులను తప్పు పట్టడం లేదని అంటూనే ఆ విధమైన ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, వద్దా... అమరావతి అంటే ఉన్నవారికేనా.. ఉన్నవారికి భూములు ఉచితంగా ఇవ్వడం మంచి పద్దతా అనేవాటిపై విచారించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

అమరావతిలో న్యాయమూర్తులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన చం్ద్రాబబు రూ. 25 లక్షల చొప్పున  కట్టిన ఐఏఎస్ అధికారులకు పంగనామాలు పెట్టారని, ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుిండా కోర్టుల నుంచి స్టేలు తెస్తున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు, ఆయన బంధువులు, కావాల్సినవారు, ఆయన పార్టీవారు అమరావతిలో భూముు కొన్నారని, దీనిపై సిట్టింగ్ జడ్జి విచారణ చేసి తీర్పు ఇవ్వాలని తాను కోరుంకుటున్నానని నారాయణస్వామి అన్నారు.