Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో కూల్చివేతల కలకలం.. ఆంధ్రాయూనివర్సిటీ ప్రాంతంలో హాహాకారాలు...

విశాఖ పట్నంలో మోడీ టూర్ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు వివాదాల్లో ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. 

demolition in Andhra University area in Visakhapatnam
Author
First Published Nov 9, 2022, 7:26 AM IST

విశాఖపట్నం : విశాఖలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మూడో పట్టణ పోలీస్ స్టేషన్ మార్గంలో, ఆంధ్రవిశ్వవిద్యాలయం వసతిగృహాల సమీపంలో పోలీసు బందోబస్తు మధ్య సాగిన విధ్వంసం  వివాదాస్పదంగా మారింది.  బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదు. కనీసం ఆయా దుకాణాల్లోని సామగ్రిని భద్రపరుచుకోవడానికైనా సమయం ఇవ్వలేదు. ప్రొక్లెయిన్లు జేసీబీలతో దుకాణాలను నేటమట్టం చేయడంతో సామాగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయింది. 

ఈ కూల్చివేతలతో దుకాణదారులు, చిరు వ్యాపారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆంధ్రావర్సిటీ వసతి గృహాలు దగ్గర్లో కార్ షెడ్ లు, కార్ వాష్, టి, చికెన్ కొట్లు, పాన్ షాప్ లు కలిసి మొత్తం16 దుకాణాలు ఉన్నాయి.వీటిలో  రెండు వందల మంది వరకు నిత్యం పనిచేస్తున్నారు. ఇక్కడే తమ భూములు ఉన్నాయని ఏయూ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇందులో 1.02 ఎకరాలపై ఒకరికి అనుకూలంగా 13 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  అయితే తమ భూములు ఆక్రమణలకు గురయ్యాయని,  చర్యలు తీసుకోవాలని జివిఎంసి అధికారులకు విశ్వవిద్యాలయ అధికారులు ఫిర్యాదు చేశారు.

న్యూడ్ వీడియో తరువాత మరో వివాదంలో గోరంట్ల మాధవ్.. ఈ సారి ఏంటంటే..

వాటిని తొలగించడానికి జీవీఎంసీ అధికారులు ప్రధాని మోదీ పర్యటనను అవకాశంగా తీసుకున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లలో భాగంగా పార్కింగ్ తదితర అవసరాలకు వీలుగా అందుబాటులో ఉన్న అన్ని స్థలాలను చదును చేస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదులు వచ్చిన చోట ఉన్న దుకాణాలను కూడా తొలగించారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున తమ జోలికి రారనే భరోసాతో ఉన్న భూ యజమాని వారసులు తొలగింపులు విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు.

అద్దెకున్న వారిపై..
దుకాణదారుల్లో ఎక్కువమంది స్థలాలను అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేస్తున్నవారే. వీరు  నెలనెలా భూ యజమానులకు అద్దెలు చెల్లిస్తున్నారు. ఆయా స్థలాల స్వాధీనానికి మొదట యజమానులతో చెప్పించి,  తర్వాతే తమను ఖాళీ చేయించాలిగానీ.. ఏకపక్షంగా దుకాణాలను ధ్వంసం చేశారని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దుకాణాలను మరో ప్రాంతానికి తరలించుకుని, వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ధ్వంసం చేయడం దారుణమని మండిపడుతున్నారు. తమ జీవితాలను  మళ్లీ సున్నా నుంచి ప్రారంభించాల్సి వస్తుందని వాపోతున్నారు. తమ పిల్లలను ఎలా పెంచుకోవాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. బాధితులను టిడిపి, జనసేన నేతలు పరామర్శించించారు. 

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని 1.02 ఎకరాల భూమిలో దశాబ్దాల పాటు పశువుల్ని పెంచుకున్న కొంచెం అప్పారావు సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాల్లో కేసు గెలిచారు.  అప్పారావు తన వాటాను తన తొమ్మిది మంది పిల్లలకు పంచారు. వారిలో కొందరు  స్థలాలను విక్రయించగా, మరికొందరు నేటికీ వాటిపై వచ్చే అద్దెతోనే జీవిస్తున్నారు. దీనిమీద బాధితురాలు, అప్పారావు కూతురు సూర్యకాంతం మాట్లాడుతూ.. ‘నాకిప్పుడు 80 యేళ్లు.. ఈ స్థలం మా తండ్రి అప్పారావు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి దక్కించుకున్నది. నా వాటాగా 350 గజాలు వచ్చింది. అందులో రెండు దుకాణాలు వేసుకున్నాను. నా కూతురు దగ్గర ఉంటూ.. ఆ దుకాణా మీద వచ్చే అద్దెలతోనే బతుకుతున్నా.. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న భూమిని ఆక్రమణ అంటుంటే గుండెపోటు వచ్చినంత పనైంది’ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios