రానున్న ఎన్నికల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలకు పెద్ద షాక్ తగలనుందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏల్లో ఓ ఇద్దరికో ముగ్గురికో తప్ప మిగితా వాళ్ళకు టిక్కెట్లు దక్కేది అనుమానమేనట. అందుకే వారినందిరినీ చంద్రబాబునాయుడు మానసికంగా సిద్దం చేస్తున్నారట ఇప్పటి నుండే.

ఇంతకీ అంత చేటు సమస్యలు ఏమి వచ్చింది ఫిరాయింపులకు? అంటే చంద్రబాబు ఈ మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఎంఎల్ఏల పనితీరుపై సర్వే చేయించారట. అందులో చాలామంది పనితీరుపై నెగిటివ్ మార్కులే వచ్చాయట. అందులోనూ ఫిరాయింపుల్లో ఎవరిపైనా అంటే మంత్రులపైన కూడా జనాల్లో సదభిప్రాయం లేదని సర్వేల్లో తేలిపోయిందట. అందుకనే వారి స్ధానంలో వచ్చే ఎన్నకల్లో కొత్త అభ్యర్ధులను రంగంలోకి దింపటానికి చంద్రబాబు ఫిక్స్ అయ్యారట.

ఆ విషయాన్ని చివరి నిముషంలో చెబితే ఎక్కడ సమస్యలు వస్తాయో అన్న ఉద్దేశ్యంతో సర్వే వివరాలను నేరుగా ఎంఎల్ఏలకే అందచేశారట. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో ఫిరాయించిన 5 మంది ఎంఎల్ఏల ద్వారా సర్వే నివేదికలు బయటకపడ్డాయట.

వీరిలో మంత్రి అఖిలప్రియ పరిస్ధితి కూడా అంతంతమాత్రంగానే ఉందట. సర్వే రిపోర్టులు అందుకున్న ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది.  సర్వే రిపోర్టును సాకుగా చూపించి చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వరన్న విషయం తేలిపోయింది. అటు వైసిపిలోకి తిరిగి వెళ్ళలేరు. తాత్కాలిక లబ్దికి కక్కుర్తిపడి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టనందుకు ఇపుడు బోరుమంటున్నారట.