ఫిరాయింపు ఎంఎల్ఏలకు కష్టాలు తీరేట్లుగా లేవు. ఎందుకంటే, జనాలు ఫిరాయింపులను బాగానే అసహ్యించుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలిచింది. ఫిరాయింపు ఎంఎల్ఏకు ఘోర అవమానం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఫిరాయింపు ఎంఎల్ఏ అనుకున్నారు. అలా అనుకుని జనాల్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా వాళ్ళంతా దాడి చేసినంత పనిచేశారు. దాంతో ఏం చేయాలో దిక్కుతెలీక అక్కడి నుండి పారిపోయారు. అయినా వదలిపెట్టలేదు జనాలు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఈమధ్యనే ప్రభుత్వం ‘దళితతేజం’ కార్యక్రమం మొదలుపెట్టింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి ఫిరాయింపు ఎంఎల్ఏ ముత్తముల్ల అశోక్ రెడ్డి కూడా అందులో పాల్గొన్నారు. గిద్దలూరు మండలంలోని సంజీవరావుపేట దళితవాడకు చేరుకున్నరు. దళితుల గురించి ఎంఎల్ఏ మాట్లాడ్డం మొదలుపెట్టగానే స్ధానికులు అడ్డుకున్నారు.

ఎంఎల్ఏగా ఉంటూ ఓ త=దళిత ఫీల్డ్ అసిస్టెంటును సస్పెండ్ చేయావని, దళితుడైన సర్పంచ్ చెక్ పవర్ ఎందుకు రద్దు చేయించావంటూ ఎదరు ప్రశ్నించారు. దాంతో ఎంఎల్ఏకి ఒళ్ళుమండిపోయింది. ఘాటుగా సమాధానం చెప్పారు. దాంతో స్ధానికులు రెచ్చిపోయి ఎంఎల్ఏ మీదకు దాడికి ప్రయత్నించారు.

దాంతో అలర్టయిన పోలీసులు, ఎంఎల్ఏ మద్దతుదారులు స్ధానికులను అడ్డుకున్నారు. దాంతో గొడవ మరింత పెద్దదైంది. లాభం లేదనుకున్న ఎంఎల్ఏ అక్కడి నుండి వెళిపోతుంటే స్ధానికులు చెప్పులు చూపించారు. మళ్ళీ ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తావు కదా అప్పుడు చెబుతాం నీ సంగతి అంటూ గాల్లోకి చెప్పులు విసిరారు.