దళిత విద్యార్థినిని స్నేహం పేరుతో నమ్మించి.. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఆదివారం రాత్రి ఓ దారుణ ఘటన జరిగింది. ఇది సోమవారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ దళిత విద్యార్థినిని ఓ వ్యక్తి స్నేహం పేరుతో మాయ మాటలు చెప్పి.. పెళ్లి పేరుతో నమ్మించాడు. సరదాగా తిరిగి వద్దామని చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. హాస్టల్ గేటు దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు.
మచిలీపట్నంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది. కూతురు కనిపించడం లేదంటూ హాస్టల్ నిర్వాహకులు చెప్పడంతో కంగారుగా ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు.. అచేతన స్థితిలో, నిస్సహాయంగా ఆస్పత్రిలో ఉన్న కూతురిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే నిందితుడి కుటుంబం వైసిపి సానుభూతిపరులు, అధికార పార్టీకి చెందిన కీలక వ్యక్తుల అనుచరుడుగా నిందితుడు చలామణి అవుతున్నాడు.
ఆశ్రమంలో చేరిన అనాథ బాలికపై స్వామీజీ పైశాచికత్వం.. రెండేళ్లుగా అత్యాచారం, చిత్రహింసలు...
ఈ మధ్య కాలంలో టిడిపి, జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంలోని వసతి గృహంలో ఏలూరు జిల్లాకు చెందిన ఓ దళిత బాలిక డిగ్రీ చదువుకుంటుంది. ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడితో ఏడాది కిందట ఆమెకు పరిచయమైంది. సతీష్ చిన్న చిన్న కాంట్రాక్టులు చేసేవాడు. ఆ దళిత బాలికతో మాటలు కలిపి స్నేహం చేశాడు.పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆరు నెలల క్రితం హైదరాబాదులోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో చేరాడు.
ఆదివారం ఉదయం మచిలీపట్నం వచ్చాడు. అమ్మాయికి ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు. అతడిని కలవడానికి అమ్మాయి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హాస్టల్ నుంచి బయటికి రాగా సతీష్ ఆమె ఓలాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బాలికను ఊర్లో ఉన్న తన బంధువుల ఇంటికి తీసుకు వెళ్లాడు. తిరిగి ఆమెను హాస్టల్లో దింపడానికి మచిలీపట్నం బయలుదేరగా వారితో పాటు స్నేహితుడు కూడా వచ్చాడు. మచిలీపట్నం వస్తున్న క్రమంలో మధ్యలో ఆగి స్నేహితులు ఇద్దరు మద్యం తాగారు. ఆ సమయంలో ఆమెతో కూడా బలవంతంగా మద్యం తాగించారు.
ఆ తర్వాత తీసుకొచ్చి హాస్టల్ దగ్గర బయట వదిలేసి వెళ్లిపోయారు. సాయంత్రం పూట హాస్టల్లో వార్డెన్ గమనించగా విద్యార్థిని కనిపించలేదు. ఆమె కోసం ఫోన్ చేసిన సమాధానం లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బాలిక కనిపించడం లేదంటూ వార్డెన్ పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు వెళ్లింది. అందులోనే ఆమె వచ్చిందంటూ సమాచారం రావడంతో వెనక్కి తిరిగి వచ్చింది. హాస్టల్ కు వచ్చేసరికి బాలిక పరిస్థితి చూసి వార్డెన్ వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మద్యం మత్తులో అలా ఉందని తెలిపారు.
కూతురు కనిపించడం లేదన్న సమాచారంతో బయలుదేరి వచ్చిన తల్లిదండ్రులు.. కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి తీవ్రవిచారానికి లోనయ్యారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాలిక నుంచి వివరాలు సేకరించి, నిందితుడు సతీష్, అతని స్నేహితుడి మీద పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదయ్యింది.
