ఆంధ్రజ్యోతి, ఈనాడులపై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు (వీడియో)

Dagguabat Purandheswari comments against media
Highlights

ఈ వీడియో ఎక్కడిదనేది తెలియడం లేదు గానీ ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

బిజెపి సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను రెండు వార్తలు రాయడం ఆపేయమనండి, ప్రజలకే తెలిసిపోతుందని ఆమె అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏమిటని అడిగారు. 

ఈ వీడియో ఎక్కడిదనేది తెలియడం లేదు గానీ ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొంత మంది తనను కలిసినప్పుడు పురంధేశ్వరి మాట్లాడిన విషయాలు రికార్డు అయ్యాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వల్ల గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందా అని ఆమె అడిగారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రంలో గ్రామాలకు నిధులు వస్తున్నాయని, చిన్న గ్రామాలకు 30 నుంచి 35 లక్షలు వస్తున్నాయని, పెద్ద గ్రామ పంచాయతీలకు కోటిన్నర రూపాయలు వస్తున్నాయని ఆమె చెప్పారు. 

రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని ఆమె అన్నారు. లంచాల వైనంపై కూడా ఆమె మాట్లాడారు. కాగ్ బయటపెట్టిన అవినీతి గురించి మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారో వీడియో చూడండి.

 

loader