హైదరాబాద్ లో డబ్బావాలా

Dabbavala services started in Hyderababad
Highlights

హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సేవలు ప్రస్తుతానికైతే కూకట్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, మూసాపేట, చందానగర్, బీహెచ్ ఇఎల్, మణికొండ, బొల్లారం, నిజాంపేట, కెపిహెచ్బి, మదీనాగూడ, హఫీజ్ పేట, బాబుపల్లి ప్రాంతాల్లో స్కూళ్లు, కార్యాలయాలకు మాత్రమే సేవలు పరిమితమయ్యాయి.

ముంబాయిలో బాగా పాపులరైన ‘డబ్బావాలా’ సేవలు హైదరాబాద్ లో కూడా మొదలయ్యాయి. బెంటోవ్యాగన్ పేరుతో ఈ సేవలు కొత్తగా స్టార్ట్ అయ్యాయి. ఆఫీసులకు, కళాశాలలతో పాటు ఇతర కార్యాలయాలకు మధ్యహ్నం భోజన క్యారీయర్లను అందించే సర్వీసునే మహారాష్ట్రలో డబ్బావాల అంటారు. అదే తీరుగా హైదరాబాద్ లో కూడా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ సేవలు ప్రస్తుతానికైతే కూకట్ పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, మూసాపేట, చందానగర్, బీహెచ్ ఇఎల్, మణికొండ, బొల్లారం, నిజాంపేట, కెపిహెచ్బి, మదీనాగూడ, హఫీజ్ పేట, బాబుపల్లి ప్రాంతాల్లో స్కూళ్లు, కార్యాలయాలకు మాత్రమే సేవలు పరిమితమయ్యాయి. త్వరలోనే హైదారబాద్ మొత్తం విస్తరిస్తామని బెంటోవ్యాగన్ నిర్వాహకురాలు ఎస్ విజయలక్ష్మి చెప్పారు. 5 కిలోమీటర్ల దూరానికి నెలకు రూ. 500 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సేవలకు ఆధరణ పెరుగుతోందన్నారు.

loader