తీరాన్ని తాకిన గులాబ్ తుఫాన్.. మరో 3 గంటల పాటు ముప్పే, వణుకుతున్న ఉత్తరాంధ్ర
గులాబ్ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకింది. కళింగ పట్నానికి ఉత్తరంగా 25 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ తీరాన్ని దాటింది. తుఫాన్ తీరం దాటడానికి మరో 3 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కలింగపట్నం, గోపాల్‌పూర్ మధ్య తుఫాన్ తీరం దాటనుంది
గులాబ్ తుఫాను శ్రీకాకుళం జిల్లాలో తీరాన్ని తాకింది. కళింగ పట్నానికి ఉత్తరంగా 25 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ తీరాన్ని దాటింది. తుఫాన్ తీరం దాటడానికి మరో 3 గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కలింగపట్నం, గోపాల్‌పూర్ మధ్య తుఫాన్ తీరం దాటనుంది. ఉత్తరాంధ్ర వెంట గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
మరోవైపు ఉత్తరాంధ్ర, ఒడిషాలను గులాబ్ తుఫాన్ వణికిస్తోంది. అర్ధరాత్రి తీరాన్ని దాటనుండటంతో ఇప్పటికే పలు చోట్ల గాలులు, సముద్రంలో అలజడి మొదలైంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావం అత్యంత ప్రమాదకరంగా వుండే అవకాశం వుండటంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగాయి. గులాబ్ తుఫాన్ .. ఒడిషా, ఆంధ్రాలపై నాలుగు రోజుల పాటు ప్రభావం చూపనున్నట్లు ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో బలమైన ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.