చంద్రబాబు, జగన్‌లను ఒకే వేదికపైకి తీసుకు రావాలి: సీపీఐ నారాయణ సూచన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ చేసే ఉద్యమంలో చంద్రబాబునాయుడు, జగన్ ను ఒకే వేదికపై తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ నేతలకు సూచించారు.
విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ చేసే ఉద్యమంలో చంద్రబాబునాయుడు, జగన్ ను ఒకే వేదికపై తీసుకురావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ నేతలకు సూచించారు.
శుక్రవారం నాడు విశాఖపట్టణంలోని కూర్మన్నపాలెం గేట్ వద్ద కార్మిక సంఘాలు నిర్వహించిన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
2019 ఎన్నికల తర్వాత తొలిసారి గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావులు ఒకేవేదికను పంచుకోవడం ఇదే తొలిసారి.ఇదే సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు.
రెండు పార్టీలకు చెందిన నేతలతో సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగే పోరాటంలో చంద్రబాబును, జగన్ ను ఒకే వేదికపై తీసుకురావాలని గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ లకు సూచించారు నారాయణ.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.