స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

విద్యుత్ లోపాలు సరిచేయకపోవడం వల్లే స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తేల్చి చెప్పారు. స్వర్ణ ప్యాలెస్ లో ఈ నెల 9వ  తేదీన అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు మరణించిన విషయం తెలిసిందే.

COVID 19 facility fire tragedy: Probe finds fault with hospital, hotel managements

విజయవాడ: విద్యుత్ లోపాలు సరిచేయకపోవడం వల్లే స్వర్ణ ప్యాలెస్ లోని కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తేల్చి చెప్పారు. స్వర్ణ ప్యాలెస్ లో ఈ నెల 9వ  తేదీన అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు మరణించిన విషయం తెలిసిందే.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన కేసులో నిందితుల అరెస్టుపై పోలీసులు నాలుగు పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఈ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు.

స్వర్ణ ప్యాలెస్ లో విద్యుత్ లోపాలు ఉన్నట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. విద్యుత్ లోపాలను సరి చేయాలంటే  పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం విద్యుత్ లోపాలను సరిచేయలేదని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఆరోపించారు.

also read:స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం: రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి, బంధువులకు నోటీసులు

విద్యుత్ వ్యవస్థలో లోపాలున్న విషయం తెలిసి కూడ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ సెంటర్  నిర్వహించిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు.

వారం రోజుల క్రితం కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరగడానికి రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాలదే బాధ్యతగా పోలీసులు అభిప్రాయపడ్డారు.కోవిడ్ సెంటర్ ఏర్పాటు విషయమై రమేష్ ఆసుపత్రి, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యాల మధ్య ఎంఎస్ఓ కుదిరిన విషయాన్ని పోలీసులు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదని కూడ రిమాండ్ రిపోర్టులో పోలీసులు అభిప్రాయపడ్డారు.
నిందితులు బయటకు వస్తే పారిపోయే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios