టిడిపి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ కు కోర్టు జైలుశిక్ష విధించింది. గతంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు వట్టి వసంతకుమార్ ను కొట్టిన కేసులో చంతమనేనికి బీమడోలు కోర్టు బుధవారం 6 నెలలు జైలుశిక్ష విధించింది. అలాగే, రూ. 5 వేల జరిమానా కూడా విధించింది. చింతమనేనిపై ఇప్పటికే పలు కేసులున్న విషయం తెలిసిందే. తనదైన దూకుడు వల్ల చింతమనేని అనేకమార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు. చంద్రబాబునాయుడు ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తన పద్దతి మార్చుకోలేదు. ఇపుడు వట్టి వసంతకుమార్ కేసులో చింతమనేనికి జైలుశిక్ష పడటం గమనార్హం.