సదావర్తి భూములపై గతంలో ప్రభుత్వం నిర్వహించిన వేలంపాట రద్దు చేస్తూ కొత్తగా వేలం వేయాలని కోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 వారాల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని కూడా గడువు విధించటం గమనార్హం. సదావర్తి సత్రానికి తమిళనాడులోని 84 ఎకరాలను తన మద్దతుదారుడైన రామానుజయ్యకు చంద్రబాబు కారు చౌకగా కట్టబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి సదావర్తి భూములపై కోర్టు షాక్ ఇచ్చింది. సదావర్తి భూములపై గతంలో ప్రభుత్వం నిర్వహించిన వేలంపాట రద్దు చేస్తూ కొత్తగా వేలం వేయాలని కోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 6 వారాల్లో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని కూడా గడువు విధించటం గమనార్హం.
సదావర్తి సత్రానికి తమిళనాడులోని 84 ఎకరాలను తన మద్దతుదారుడైన రామానుజయ్యకు చంద్రబాబు కారు చౌకగా కట్టబెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. బహిరంగ వేలం లేకుండానే సుమారు రూ. 800 కోట్ల విలువైన భూములను రామానుజయ్యకు ప్రభుత్వం కేవలం రూ. 22 కోట్లకే సొంతం చేసేసింది.
ఎప్పుడైతే విషయం వెలుగు చూసిందో వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించటం తదితర విషయాలన్నీ అందరికీ తెలిసిందే. ఈ భూములకు రూ. 22 కోట్లకన్న రావని ప్రభుత్వం చెప్పినపుడు అంతకన్నా ఎక్కువిస్తే అవే భూములను ఆళ్ళే తీసుకోవచ్చంటూ కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆళ్ళ అదనంగా రూ. 5 కోట్లు ఎక్కువ ధర చెల్లించారు. అంటే రామానుజయ్య రూ. 22 కోట్లు చెల్లిస్తే, అవే భూములకు ఆళ్ళ రూ. 22 కోట్లు చెల్లించారు. దాంతో ప్రభుత్వ వాదన వీగిపోయింది.
అదే విషయమై కోర్టు ఈరోజు తీర్పు చెప్పింది. ఆళ్ళ చెల్లించిన రూ. 27 కోట్లనే బేస్ ధరగా నిర్ణయించాలని కోర్టు ప్రభుత్వాన్న ఆదేశించింది. ఒకవేళ వేలంపాటలో ఎవరూ పాల్గొనకపోతే అప్పుడు ఆ భూములను ఆళ్లకే సొంతం చేయాలని కూడా తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నది కోర్టు. గుట్టు చప్పుడు కాకుండా వందల కోట్లు విలువైన భూములను సొంతం చేసుకుందామనుకున్న చంద్రబాబునాయుడుకు కోర్టులో ఒక విధంగా చుక్కెదురేనట్లే.
