ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన దంపతుల ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఇద్దరు పిల్లలతో పెట్రోల్ డబ్బాతో వచ్చి ఆత్మహత్యా యత్నం చేశారు. 

"

నెల్లూరు జిల్లా దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ తమ దగ్గర ఒక కోటి రూపాయల పైన తీసుకుని మోసం చేశారని దంపతులు ఆరోపిస్తున్నారు. 

పొలం ఆన్‌లైన్ చేస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన సమాచారం తెలుసుకుని సచివాలయానికి పోలీసులు వచ్చారు. ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.