విశాఖ కొమ్మదిలో విషాదం.. ఆర్థిక కారణాలతో దంపతుల ఆత్మహత్య ఘటనలో కొత్త ట్విస్ట్...
కొమ్మాదిలో ఓ దంపతులు తాముంటున్న అపార్ట్మెంట్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థికకారణాలే దీనికి కారణంగా తెలుస్తోంది.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కొమ్మాదిలో విషాద ఘటన వెలుగు చూసింది. తాము ఉంటున్న అపార్ట్ మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు నరసాపురం నుంచి వచ్చి కొమ్మాదిలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న దంపతులు ఎంవీకే ప్రసాద్, రాజరాజేశ్వరిలుగా గుర్తించారు.
కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. వాటిని తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుుని విచారణ చేపట్టారు.
స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షల్లో ప్రసాద్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో చాలామందిని డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. ఒత్తిడి పెరిగిపోవడంతో సొంత ఇంటిని కూడా అమ్మేసి ఆ డబ్బులు కొంతమందికి కట్టినట్టు సమాచారం.
ఆ తరువాత ఇంకా ఒత్తిడి పెరగడం స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ మీద సీఐడీ విచారణ జరుగుతుండడంలాంటి కారణాలతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అనేక మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రసాద్ కు వాటర్ ప్యూరిఫయర్లు బిగించే కాంట్రాక్ట్ ఉంది. ఈ క్రమంలోనే అనేకమంది నిరుద్యోగులతో అతనికి పరిచయాలయ్యాయి. వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి, తిరిగి ఇవ్వలేదు.