ఒకే గ్రామం, ఒకే సూపర్ స్ప్రెడర్... 117మందికి కరోనా

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బుసలు కొడుతోంది. మంగళవారానికి జిల్లాలో కేసుల సంఖ్య 303కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. 

coronavirus outbreak in east godavari

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బుసలు కొడుతోంది. మంగళవారానికి జిల్లాలో కేసుల సంఖ్య 303కు చేరినట్లు అధికారులు ప్రకటించారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో గతనెల 21న నమోదైన పాజిటివ్‌ మరణానికి అనుబంధంగా జిల్లాలో ఇప్పటివరకు 157 కేసులు నమోదయ్యాయి. ఆ ఒక్క గ్రామంలోనే ఈ సూపర్‌ స్ప్రెడర్‌ కలకలానికి 117 మంది వైరస్‌ బారినపడ్డారు. 

జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఇక్కడ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేసి కీలక విభాగాలను అందుబాటులో ఉంచారు. గ్రామం మొత్తాన్ని కట్టడి ప్రాంతంగా మార్చి రాకపోకలు నిలిపివేశారు. లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలవుతుండగా గ్రామంలో హోటల్‌కు అనధికారిక అనుమతులు ఇవ్వడమే వైరస్‌ వ్యాప్తికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 5,300 కుటుంబాలు... 21వేల జనాభా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు గుండెలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది. 

వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కూలీల వల్ల కూడా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. దీంతో ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు వచ్చేవారందరికీ అధికారులు పరీక్షలు చేశాకే అనుమతిస్తున్నారు. 

read more  మరో కోయంబేడ్ లా గుంటూరు మార్కెట్... ఒకేరోజు 18, మొత్తంగా 26 కరోనా కేసులు

కోనసీమ కోరనా వైరస్ వ్యాధితో వణికిపోతోంది. ఒక్క రోజులోనే కోనసీమలో 28 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాజోలు క్వారంటైన్ సెంటర్ లో 12 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. 

రావులపాలెంలో ఇద్దరికి, ముమ్మిడివరంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. అమలాపురంలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. పిఠాపురంలో ఓ నర్సుకు కరోనా వైరస్ సోకింది. ముంబై వలస కార్మికుల కారణంగా కోనసీమలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది.  గుంటూరు జిల్లాలోని గోరంట్లలో ఓ కూరగాయల వ్యాపారి నుంచి 24 మందికి కరోనా వైరస్ వ్యాపించింది. ఆ వ్యాపారి ఇంట్లోని ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

మార్కెట్లోని 18 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇంటి పక్కవాళ్లకు ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. ఒక్క రోజులోనే 23 మందికి వైరస్ సోకింది.మార్కెట్లోని 250 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios