కరోనా వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా నేపథ్యంలో గురువారం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

Also Read:లండన్ నుంచి కూతుర్లు వెనక్కి: జగన్ పారాసిటమాల్ వ్యాఖ్యలపై సెటైర్లు

కోచింగ్ సెంటర్లు సహా అన్నీరకాల విద్యా సంస్థలను మూసివేయాలని, ఆదేశాలను పట్టించుకోని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

Also Read:వైఎస్ జగన్ కు షాక్: స్థానిక ఎన్నికలపై తేల్చేసిన సుప్రీంకోర్టు

భారత్‌లో కరోనా చాప కింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 152కు చేరగా, ముగ్గురు మరణించారు. తాజాగా బెంగళూరులో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.