ఆంధ్రప్రదేశ్ పై కరోనా వైరస్ భూతం పంజా విసురుతోంది. నిన్న ఉదయం 9 గంటల నుండి నేటి ఉదయం 9 గంటల వరకు 24,962 సాంపిల్స్ ని పరీక్షించగా 727 మంది కరోనా పాజిటివ్ గా తేలారు. దీనితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15141 కి చేరింది. ఇతర రాష్ట్రాలవారిని కూడా కలుపుకుంటే 17, 699 కేసులకు చేరుకుంది. 

నిన్నొక్కరోజే 311 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్నొక్కరోజే 12 మంది మరణించారు. కర్నూల్, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున ప్రజలు మరణించారు. విశాఖపట్నం, చిత్తూర్ లలో ఇద్దరేసి చొప్పున మరణించారు. కడప, విజయనగరంలలో ఒక్కో మరణం నమోదయింది. ఇప్పటివరకు మొత్తం 218 మంది మరణించారు. 

రాష్ట్రంలో 9,96,573 సాంపిల్స్ ని టెస్ట్ చేసారు. 9473 మంది కరోనా చికిత్స పొందుతున్నారని, 7453 మంది ఆసుపత్రుల్లో, 2020 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.