కరోనా ఎఫెక్ట్: అనకాపల్లిలో ఏడుగురితోనే ఒక్కటైన జంట
విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో ఓ జంట ఏడుగురి సమక్షంలో ఒక్కటైంది. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఈ జంట పెళ్లి చేసుకొంది. కరోనా కారణంగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ జంట ఒక్కటైనట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.
అనకాపల్లి: విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో ఓ జంట ఏడుగురి సమక్షంలో ఒక్కటైంది. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఈ జంట పెళ్లి చేసుకొంది. కరోనా కారణంగా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ జంట ఒక్కటైనట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.
కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు, శుభకార్యాలను వాయిదా వేసుకొంటున్నారు.ముందుగా నిర్ణయం తీసుకొన్న ముహుర్తం లేదా ఇతరత్రా కారణాలతో శుభకార్యాలను వాయిదా వేసుకొంటున్నారు. కానీ విశాఖపట్టణంలో గురువారం నాడు రాత్రి ఓ జంట పెళ్లి చేసుకొంది.
విశాఖపట్టణం జిల్లా గవరపాలెం తాకాశి వీధికి చెందిన ఈశ్వరరావుకు నిన్న వివాహం జరిగింది. సొంతూళ్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని భారీ కళ్యాణ మండపం బుక్ చేసుకోవడమే కాక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకొన్నారు.
లాక్‌డౌన్ విధించడంతో పెళ్లికి ఎక్కువ మంది హాజరు కాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. మంచి ముహుర్తం ఉన్న కారణంగా ఉభయ కుటుంబాలు ఇష్టపడకపోవడంతో నిరాండబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
also read:కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న జంట
వివాహ వేడుకకు పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితో పాటు మరో ముఖ్యమైన ఏడుగురు అతిథులను మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.ఏడుగురు అతిథుల సమక్షంలోనే పెళ్లి చేసుకొన్నారు.
మరోవైపు ప్రసాద్, సౌజన్య ల వివాహన్ని రెండు కుటుంబాల పెద్దలు నాలుగు నెలల క్రితమే ముహూర్తం నిర్ణయించారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కువ మందిని అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏడుగురితోనే ఈ రెండు జంటల పెళ్లికి ఏడుగురిని మాత్రమే అనుమతిచ్చారు అధికారులు.