Asianet News TeluguAsianet News Telugu

ఒంగోలు: తప్పించుకునే యత్నం.. కరోనా బాధితుడిని పట్టుకున్న సిబ్బంది

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కరోనా బాధితుడు ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గురువారం నగరంలోని రిమ్స్ రెండో అంతస్తు నుంచి పారిపోతుండగా ఆ వ్యక్తిని సిబ్బంది పట్టుకున్నారు.

corona positive man attempts to escape in ongole
Author
Ongole, First Published Mar 19, 2020, 4:04 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కరోనా బాధితుడు ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గురువారం నగరంలోని రిమ్స్ రెండో అంతస్తు నుంచి పారిపోతుండగా ఆ వ్యక్తిని సిబ్బంది పట్టుకున్నారు.

ఈ నెల 15న లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు, అధికారులు అతనిని రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఎవరూ లేని సమయంలో చూసిన ఆ యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి చికిత్స పొందుతున్నాడు.

Also Read:శ్రీ వెంకటేశ్వరుని తాకిన కరోనా: తిరుమల ఆలయం మూసివేత

గత మూడు రోజులుగా బయటి వ్యక్తులతో సంబంధాలు లేకపోవడంతో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో రిమ్స్ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. ఐసోలేషన్ వార్డు పరిసర ప్రాంతాల్లోనూ ఎవరూ సంచరించకుండా అప్రమత్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విజృంభిస్తోంది. ఏపీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో  ఒకరికి కరోనా సోకగా... తాజాగా ప్రకాశం జిల్లాలోనూ మరొకరికి కరోనా సోకినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది రక్త నమూనాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

అయితే.. వారిలో 94మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మరో 13మంది రక్త పరీక్షల రిజల్ట్ ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Also Read:వారందరికి గృహనిర్బంధ నోటీసులు... కరోనాపై ఏపి వైద్యశాఖ బులెటిన్

ఇదిలా ఉండగా... ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు, కోచింగ్ సెంటర్ లకు సెలవు ప్రకటించారు. కాగా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం యథావిధిగా ఉందని.. ఈ నెల 31 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా.. చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios