అమానుషం... కరోనా రోగులను చెత్త వాహనంలో తరలింపు: చంద్రబాబు ఆగ్రహం (వీడియో)
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపు పేటకు చెందిన కరోనా పేషేంట్స్ ని చెత్తను తరలించే వ్యాన్ లో తరలించిన అమానుష ఘటనపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపు పేటకు చెందిన కరోనా పేషేంట్స్ ని చెత్తను తరలించే వ్యాన్ లో తరలించిన అమానుష ఘటనపై మాజీ సీఎం, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటన గురించి తెలిసిన తెసులుసుకుని చాలా బాధపడ్డానని అంటూ చంద్రబాబు సోషల్ మీడియా వేదికన తెలిపారు.
''విజయనగరం జిల్లా జరజాపు పేట బిసి కాలనీలోని ముగ్గురు కరోనా రోగులను చెత్త బండి లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చాల బాధ కలిగించింది. కరోనా వైరస్ గురించి తెలియదు కానీ ఈ విధంగానే చెత్త బండిలో రోగులను తరలిస్తే వారు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ ప్రభుత్వం వారిని కనీసం మనుషుల్లా ఎందుకు చూడటం లేదు?'' అంటూ అధికారుల తీరును తప్పుబట్టారు.
read more ఒక్కరోజే 8,555 కేసులు, 67 మరణాలు: ఏపీలో లక్షా 60 వేలకు చేరువలో కేసులు
ఇక నెల్లిమర్ల ఘటనపై మునిసిపల్ కమీషనర్ వివరణ ఇచ్చారు. జరజాపు పేటకు చెందిన కొందరు గ్రామ పెద్దలు కొందరు కరోనా వ్యాధిగ్రస్తులను సమీపంలోని మహరాజా వైద్య కళాశాల ఆసుపత్రికి అత్యవసరంగా తరలించాలని భావించి వాహనం కోసం చూస్తుండగా మునిసిపల్ వాహనం వెళ్లడాన్ని గమనించారు. అత్యవసరం కావడంతో ఆ వాహనాన్ని అడ్డగించి కొవిడ్ రోగులను తరలించినట్లు తెలిసింది.
పెద్దలకు తెలిసిన ఒక డ్రైవర్ కు పిపిఈ కిట్ వేసి ఇదే వాహనంలో తరలించినట్టు తెలిసింది. అయితే ఇంతకు ముందు ఎన్నడూ ఈ వాహనం కరోనా వ్యాధిగ్రస్తులను తరలించేందుకు ఎన్నడూ నగర పంచాయతీ వినియోగించలేదు. ఈ సందర్భంలోనూ తమ అనుమతి లేకుండా, తమకు తెలియకుండానే వాహనాన్ని తీసుకు వెళ్లారు. వాహనం తీసుకు వెళ్ళడానికి బాధ్యులైన సిబ్బందిని గుర్తించి చర్యలు తీసుకుంటాం అని మునిసిపల్ కమీషనర్ అప్పల నాయుడు తెలిపారు.