ఒక్కరోజే 8,555 కేసులు, 67 మరణాలు: ఏపీలో లక్షా 60 వేలకు చేరువలో కేసులు
ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 8,555 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య లక్షా 58 వేల 764కి చేరాయి.
ఇవాళ ఒక్కరోజే కరోనాతో 67 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,474కి చేరాయి. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 74,404 కాగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 82,886కి చేరింది.
Also Read:కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా
ఇప్పటి వరకు 20,65,407 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 6,272 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 24 గంటల్లో 52,834 మంది శాంపిల్స్ పరీక్షించారు.
ఇక ఆదివారం విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,227 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వరుసగా అనంతపురం 696, చిత్తూరు 781, తూర్పు గోదావరి 930, గుంటూరు 639, కడప 396, కృష్ణా 379, కర్నూలు 996, నెల్లూరు 448, ప్రకాశం 384, శ్రీకాకుళం 492, విజయనగరం 637, పశ్చిమ గోదావరిలలో 550 మందికి పాజిటివ్‌గా తేలింది.
Also Read:తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ కి కరోనా
అలాగే కృష్ణా జిల్లాలో అత్యధికంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గుంటూరు 8, తూర్పు గోదావరి, విశాఖలో ఏడుగురు చొప్పున, కర్నూలు, నెల్లూరులలో ఆరుగురు చొప్పున, శ్రీకాకుళం 5, ప్రకాశం 4, చిత్తూరు, విజయనగరం, కడపలలో ముగ్గురు చొప్పున, అనంతపురం, పశ్చిమ గోదావరిలలో ఇద్దరు చొప్పున మరణించారు.