గుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యం కావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... ఈ నెల 14వ తేదీన  తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు వ్యక్తి చేరాడు. తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక 16వ తేదీ రాత్రి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.

Aslo Read:రంగంపేటలో కరోనా కలకలం: అంత్యక్రియల్లో పాల్గొన్న 11 మందికి కరోనా

అయితే జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతను కనిపించకుండా పోయాడు. 12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం అతని భార్య వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది.

ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా.. ఎంతమందిని అడిగినా సమాధానం చెప్పేవారు లేరని బాధితుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్ అధికారులను అడిగినా ఫలితం లేదని భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Also Read:ఏపీలో కొనసాగుతున్న కరోనా జోరు: 1,02,349కి చేరిన కేసులు