ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో నమోదైన 6,051 కేసులతో రాష్ట్రంలో కేసులు లక్షను  దాటాయి.  రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,02,349కి చేరుకొన్నాయి.

కరోనాతో మాజీ ఎమ్మెల్యే , సీపీఎం నేత ముస్కు నర్సింహ్మ మృతి


తూర్పుగోదావరి జిల్లాలో  రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. కర్నూల్ జిల్లాను దాటి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 14,696 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ జిల్లాలో12,234 కేసులు రికార్డయ్యాయి.

ఏపీ రాష్ట్రంలో 1,02,349కి కరోనా కేసులు చేరుకొన్నాయి. రాష్ట్రంలో 51,701 యాక్టివ్ కేసులున్నాయి.కరోనా సోకిన వారిలో 49,558 మంది కోలుకొన్నారు. గత 24 గంటల్లో అనంతపురంలో 524, చిత్తూరులో 367,తూర్పు గోదావరిలో1210, గుంటూరులో 744 కేసులు రికార్డయ్యాయి.కడపలో336, కృష్ణాలో 127,కర్నూల్‌లో664, నెల్లూరులో  422, ప్రకాశంలో 317, శ్రీకాకుళంలో 120, విశాఖలో655 కేసులునమోదయ్యాయి.

విజయనగరంలో157, పశ్చిమగోదావరిలో408 కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 164 మంది మరణించారు. కృష్ణాలో 149 మంది, తూర్పుగోదావరిలో 129 మంది మరణించారు.

అనంతపురంలో86, చిత్తూరులో 84, కడపలో32, నెల్లూరులో 28, ప్రకాశంలో 49,శ్రీకాకుళంలో 62,విశాఖపట్టణంలో 81,విజయనగరంలో40, పశ్చిమగోదావరిలో 88 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1090 మంది మరణించారు.

ఏపీలో ఇప్పటివరకు జిల్లాల వారీగా నమోదైన కేసులు,మరణాలు

అనంతపురం -10,247,మరణాలు 86
చిత్తూరు -7809, మరణాలు 84
తూర్పుగోదావరి-14,696, మరణాలు 129
గుంటూరు -10,747, మరణాలు 98
కడప -5093, మరణాలు 32
కృష్ణా-5707, మరణాలు 149
కర్నూల్ -12234, మరణాలు 164
నెల్లూరు- 4776, మరణాలు 28
ప్రకాశం -3866, మరణాలు 49
శ్రీకాకుళం -4694, మరణాలు 62
విశాఖపట్టణం -7436, మరణాలు 81
విజయనగరం -3329, మరణాలు 40
పశ్చిమగోదావరి -8820, మరణాలు 88