ఏపీలో కరోనా కట్టడికి... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో పటిష్టంగా వ్యాక్సినేషన్ అమలు, కోవిడ్ నివారణ, కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణ బాధ్యతలను ఈ ఐదుగురు మంత్రులలో కూడిన కమిటీ చూసుకోనుంది.  

corona monitoring committee appointed andhra pradesh akp

అమరావతి: కరోనా నియంత్రణ కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపిలో కరోనా పరిస్థితులు, నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు మంత్రులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పటిష్టంగా వ్యాక్సినేషన్ అమలు,  కోవిడ్ నివారణ, కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణ బాధ్యతలను ఈ ఐదుగురు మంత్రుల కమిటీ చూసుకోనుంది.  

ఈ కమిటీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా వ్యవహారిస్తారు. సభ్యులుగా ఆర్థిక మంత్రి  బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి,హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత, మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఉంటారు. 

ఈ నెల 22వ తేది గురువారం ఉదయం 11గంటలకు మంగళగిరిలోని ఏపిఐఐసి బిల్డింగ్ లోని కాన్ఫరెన్స్ హల్లో మంత్రులు కమిటీ సమావేశం జరుగుతుంది. రాష్ట్రములో కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలు, హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, కమాండ్ కంట్రోల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  వైద్యారోగ్య శాఖ అధికారులతో పాటు పలువురు ఉన్నతాదికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. 

read more  గుంటూరు: కోర్టులో 12 మందికి కరోనా.. బాధితుల్లో న్యాయమూర్తులు

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజువారీ కేసులు పది వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,716 మందికి పాజిటివ్ తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల  సంఖ్య 9,86,703కి చేరింది.

నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల 38 మంది మృత్యువాత పడ్డారు. దీంతో వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7,510కి చేరింది. నిన్న కృష్ణా జిల్లాలో 10, నెల్లూరు 7, తూర్పుగోదావరి 4, శ్రీకాకుళం 4, చిత్తూరు 3, ప్రకాశం 3, గుంటూరు 2, కర్నూలు 2, విశాఖపట్నం 2, అనంతపురంలలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో 3,359 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,18,985కి చేరుకున్నాయి. నిన్న 39,619 మంది శాంపిల్స్ పరీక్షంచగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 1,57,93,298కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో అనంతపురం 849, చిత్తూరు 1,180, తూర్పుగోదావరి 830, గుంటూరు 1,236, కడప 216, కృష్ణా 294, కర్నూలు 958, నెల్లూరు 934, ప్రకాశం 294, శ్రీకాకుళం 1,444, విశాఖపట్నం 810, విజయనగరం 565, పశ్చిమ గోదావరిలలో 106 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios