Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు... జగన్ సర్కార్ కీలక చర్యలు

నివారణ, వ్యాక్సినేషన్ వేగవంతంపై తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రులు సమావేశంలో చర్చించారు.

Corona cases increased in AP... Ministers Meeting With health department officers
Author
Amaravathi, First Published Mar 23, 2021, 4:37 PM IST

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది వైసిపి ప్రభుత్వం. సచివాలయంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఛాంబర్ లో బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డితో     వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్,  వైద్యారోగ్య శాఖ ఉన్నతాదికారులు అనిల్ కుమార్ సింఘాల్, ముద్దాడ రవి చంద్ర, కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా అత్యవసరంగా సమావేశమయ్యారు.  

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ, వ్యాక్సినేషన్ వేగవంతంపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. కరోనా ప్రమాదం గురుంచి ప్రజలకు మరింత ప్రచారం నిర్వహించడం కోసం అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

 అన్ని జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జిల్లా కలెక్టర్లు పరిధిలో అన్ని ప్రభుత్వ శాఖలు అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా కట్టడిలో అన్ని వాణిజ్య, వ్యాపార, ప్రజా సంఘాలు, డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు, భాగస్వామ్యం చేస్తూప్రజలకు అవగాహన కోసం అన్ని చర్యలు తీసుకుందామన్నారు. 

read more   ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: మొత్తం 8,94,044కి చేరిక

అన్ని హోటల్స్, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థల్లో, మత సంస్థల్లో కరోనా నియంత్రణపై పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించాలన్నారు. గ్రామ, పట్టణ, మండల స్థాయిలో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించి కరోనా నివారణకు ప్రజలను చైతన్య పరచాలన్నారు. 

కరోనా వ్యాక్సిన్ రోజుకి కనీసం 3లక్షలు పై బడి వేయాలని లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయలతో పాటు,1930ప్రభుత్వ హాస్పిటల్స్, 634ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో యధావిధిగా టీకా ప్రక్రియ కొనసాగిస్తామన్నారు. కరోనా టీకా తీసుకున్న వారికీ ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే 104,108అంబులెన్సు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేసే ముందు గ్రామాల్లో, పట్టణాల్లో, మైక్ ద్వారా ప్రచారం చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులకు అధికారులు తెలిపారు. 

 
          

Follow Us:
Download App:
  • android
  • ios