Asianet News TeluguAsianet News Telugu

వివేకా హత్య.. లేఖ రాసింది ఎవరో తేల్చేసిన పోలీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య  కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఆయన రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ పై కూడా హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. 

Cops confirm letter written by YS Vivekananda Reddy authentic
Author
Hyderabad, First Published Mar 18, 2019, 10:03 AM IST

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య  కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఆయన రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ పై కూడా హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది. చనిపోయేంత తీవ్రగాయాలు అయిన ఆయన నెత్తురోడుతున్న సమయంలో ఆ లేఖ నిజంగా రాశారా అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. అయితే.. నిజంగా ఆ లేఖ రాసింది వివేకానే అని చెబుతున్నారు పోలీసులు.

కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆ లేఖ రాసింది వివేకానంద రెడ్డేనని కన్ఫామ్ చేశారు. తమ దర్యాప్తులో అది నిజమని తేలిందని ఆయన చెప్పారు. ఆ లెటర్ తన కారు డ్రైవర్ తననను త్వరగా రమ్మని  చెప్పినందుకు కొట్టి చంపాడు అని ఉన్న సంగతి తెలిసిందే.

కాగా.. ఆ లెటర్ ని పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపించారు. కాగా.. అది వివేకానంద రెడ్డి చేతిరాత అని రిపోర్టులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. పది బృందాలుగా ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios