పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రహరి గోడ వివాదాస్పదంగా మారుతోంది. దీంతో దాచేపల్లి పట్టణంలోని కోట్ల బజార్ రోడ్డు విస్తరణ చేస్తున్న అధికారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రహరి గోడ వివాదాస్పదంగా మారుతోంది. దీంతో దాచేపల్లి పట్టణంలోని కోట్ల బజార్ రోడ్డు విస్తరణ చేస్తున్న అధికారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వివరాలు.. సుమారు 40 అడుగుల వరకు రోడ్ ను అధికారులు విస్తరిస్తున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణలో.. భవనాలను, పహరి గోడలను, మసీదు బురుజులను సైతం తొలగించుకుంటూ వెళ్లిపోయారు. అయితే ఆర్యవైశ్యులకు ఇలవేల్పు అయినా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన పహరి గోడ ను అధికారులు తొలగించే ప్రయత్నం చేయడం వివాదానికి కారణమైంది.
ఆలయ ప్రహరి గోడ కూల్చివేతను కొంతమంది ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రహరీ గోడను ఎలా కూల్చి వేస్తారంటూ నిరసన తెలిపారు. ఈ విషయంపై ఆర్యవైశ్యులకు మద్దతుగా తాళ్లాయపాలెం శివ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి మద్దతు తెలుపుతూ అంగుళం భూమి కూడా వదలమని తెలియజేశారు. హిందూ దేవాలయాలపై దాడులను ఎంతమాత్రం సహించేదిలేదని పేర్కొన్నారు. నగర పంచారయతీ అధికారుల అత్యుత్సాహం,నేతల తొందరపాటు నిర్ణయాన్ని ఆయన ఆక్షేపించారు. హిందూ దేవాల యాలు, ధార్మిక సంస్థల జోలికొస్తే సహించమని హెచ్చరించారు. ఆలయ ప్రహరిలో ఒక్క ఇటుక ముక్క కదిలినా పర్యవసానం తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఈ క్రమంలోనే ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. నగర పంచాయతీ అభివృద్ధి కోసం దేవాలయం లాంటి తమ మసీదును కూడా ఏం మాట్లాడకుండా త్యాగం చేశామని చెప్పారు. కానీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రహరి గోడను వారు త్యాగం చెయ్యలేరా అని ప్రశ్నించారు. పది రోజుల్లో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రహరి గోడ తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు అలా చేయకుంటే తాము కూడా మసీదును మరో పది అడుగులు ముందుకు కడతామని హెచ్చరించారు.
