కానిస్టేబుల్ రాసలీలలు

కర్నూల్: విధి నిర్వహణలో ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ ‌ ప్రియురాలితో రాసలీలల్లో మునిగిపోయాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కానిస్టేబుల్‌ను మహిళను ఇంట్లోనే బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు.

కర్నూల్ సబ్ ‌డివిజన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ బుధవారం నాడు స్టేషన్‌లో సంతకం చేసి తనకు కేటాయించిన బీట్‌కు వెళ్ళాడు. అయితే అక్కడ విధులు నిర్వహించకుండా ప్రియురాలితో రాసలీలలకు దిగాడు. రాజీవ్ గృహ కల్పలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్ళి ఆమెతో కామకేళీలో మునిగిపోయాడు. 

 అయితే ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కానిస్టేబుల్ ను, ఆ మహిళను ఇంట్లోనే ఉంచి బంధించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. 

గతంలో కూడ పలు మార్లు కానిస్టేబుల్ ఈ ఇంటికి పలువురు మహిళలను తీసుకొచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు. ప్రతి సారి కొత్త మహిళతో వచ్చేవారని చెప్పారు. రకరకాల కారణాలు చెప్పి ఇక్కడకు తీసుకొచ్చేవాడని స్థానికులు చెబుతున్నారు.