మణి శంకర్ కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వం రద్దు

Congress suspends Ayyars primary membership in the congress
Highlights

  • కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ విషయంలో అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకున్నది.

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ విషయంలో అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుండి అధిష్టానం తొలగించింది. గుజరాత్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే అయ్యర్‌‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం.  శనివారం పోలింగ్ జరగనున్న తరుణంలో మోదీపై అయ్యర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రాహుల్ కన్నెర్ర చేశారు. అసలు జరిగిందిది.

ప్రధాని మోదీని ఉద్దేశించి మణి శంకర్ అయ్యర్  ‘నీచ్‌ ఆద్మీ’అని వ్యాఖ్యానించారు. ఈ నీచ్ అనే మాట ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ నాయకులే తీవ్రంగా వ్యతిరేకించారు. కొంతమందయితే, మణిశంకర్ అయ్యర్  బిజెపి కి లాభం చేకూర్చే విధంగా, కాంగ్రెస్ హాని జరిగేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. చివరకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ వ్యాఖ్యలను విమర్శించారు.

 

ప్రధాని వ్యాఖ్యల మీద స్పందిస్తూ  అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ ’మొగల్ సంస్కృతి’కి అద్దం పడుతుతుందని, ఆ పార్టీ ఇంకా ఆ కల్చర్ లోనే ఇరుక్కుపోయిందని అన్నారు. ఒక చిన్న కిందిస్థాయి కుటుంబంనుంచి వచ్చినందునే మణిశంకర్ అయ్యర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనితోమణిశంకర్  మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

అయితే, అయ్యర్ మాత్రం తనకు  ప్రధాని తక్కువ కులం నుంచి వచ్చాడని విమర్శించే ఉద్దేశం లేదని, తనకు హిందీ సరిగ్గా రాకపోవడమే నోరు జారేందుకు కారణమయిందని సర్దిచెప్పుకున్నారు.  నీచ్ అనే మాటకు తన అలాంటి అర్థం ఉందన్న విషయం తెలియదని , ఈ పదం వాడినందుకు క్షమాపణలు చెబుతున్నానని కూడా అన్నారు.

మణిశంకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నాయకులు బాగా ఖంగు తిన్నారు. నీచ్ అద్మీ అనేమాట, దానికి ప్రధాని స్పందన తో పార్టీ ఠారెత్తి పోయింది. ఎందుకంటే,  2014 లో కూడా అయ్యర్ ప్రధానిని ’చాయ్ వాలా ప్రధాని అవుతారా’ అంటూ హేళన చేశారు. అంబేద్కర్ ఆశ‌యాల‌కునిజం చేయడానికి స్వాతంత్ర్య సమర యోధులయిన జవహ‌ర్‌లాల్‌ నెహ్రూ కృషి చేశార‌ని, ఆయన వారసులు ఇపుడు పార్టీ నడిపిస్తున్నారని, అటువంటి కుటుంబంపై ప్ర‌ధాని మోదీ అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని చెబుతూ చాయ్ వాలా ప్రధాని అవుతారట అని ఎగతాళి చేశారు. ఇది కాంగ్రెస్ పతనానికి బాటా వేసిందని పార్టీలో అనుమానం ఉంది. అందుకే ఇపుడు భారీ నష్టం జరగకుండా ఉండేందుకు మణిశంకర్ అయ్యర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

 

 

 

loader