కేంద్ర సాయమంతా విభజన చట్టంలో ఉంది. కాళ్లా వేళ్లా బడి దానికి స్పెషల్ ప్యాకేజీ అని పేరు పెట్టించుకుని చంద్రబాబు చాలా  సౌండ్ చేస్తున్నాడు, మోసగిస్తున్నాడు

 చట్టంలో ఉన్నదానికి మళ్లీ చట్టబద్ధతేంది చంద్రబాబు నాయుడూ, ఆ చంకలేగరేసుకోవడం ఎంది, అంటున్నారు ఆంధ్రా శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు (కాంగ్రెస్ ) సి. రామచంద్రయ్య.

తెలుగు వాళ్లని పిచ్చోళ్లని చేసేందుకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ఏదో సాధించినట్లు రోజూ ప్రకటించుకోవడం, ఆయనకాయనే అభినందించుకోవడం , తముళ్లంతా కలసి చప్పట్లు కొట్టడం, అంతా ఒక డ్రామా లాగా జరుగుతూ ఉందని ఈ రోజు ఆసియా నెట్ తో మాట్లాడుతూ వ్యాఖ్యనించారు.

‘ ఆ పొద్దు ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం నిలబడ్డారు. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మట్టి కలుపుతున్నాడు. అసంబ్లీ ఆయన ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానం ఏమిటి, ఎందుకు,‘ అని ఆయన ప్రశ్నించారు.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధన్యవాద తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టారో కేంద్రానికి అర్థమయి చావదని ఆయన వ్యాఖ్యానించారు.

‘ కేంద్రం దండిగా సాయం చేస్తాంవుందని ముఖ్యమంత్రి అంటున్నాడు. అదే చంద్రబాబు అందంగా ఉన్నాడని చేస్తున్నారా. ఆంధ్రాకు ఏమేమి సాయం చేయాలో అంతా రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. ఈ చట్టం పార్లమెంటులో పాసయింది. అంటే కేంద్రం చేసే సహాయానికి చట్టబద్ధతు ఉంది. మళ్లీ క్యాబినెట్ ఎందో తీర్మానం చేసిందని, దానితో చట్టబద్ధత వచ్చిందని, అదంతా తన గొప్పతనమని అంటున్నాడు. ఎంత మోసం. ఇంతకంటే ఆత్మ వంచన ఉంటుందా,‘ రామచంద్రయ్య ప్రశ్నించారు.

‘ రాష్ట్ర విభజన చట్టంలోని చేస్తున్న సహాయానికి, వాళ్లకాళ్లా వేళ్లాబడి స్పెషల్ ప్యాకేజి అని పేరు పెట్టించుకున్నావ్. మళ్లీ బతిమాలి క్యాబినెట్ లో టేబుల్ ఐటెంగా పెట్టించుకున్నావ్. కేంద్రం నావల్లే ప్యాకేజీ ఇచ్చిందని ధన్యవాదాలు చెప్పుకుంటున్నావ్. నీ రాజకీయ బలహీనత, వైఫల్యం బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికే దీనికి ప్రత్యేక సహాయం ముద్రవేసి, ఎంతో ప్రత్యేక హోదా కంటేచాలా గొప్పదని చెప్పుకుంటున్నావ్, ప్రజలు గమనించకమానరు,’ అని ఆయన హెచ్చరించారు.

పోలవరానిక జాతీయ హోదా చట్టంలో ఉంది. తెలంగాణలోని ముంపు మండలాల్ని కలపడం కూడా విభజన చట్టం ‍ప్రకారమే జరిగింది. విభజన చట్టంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాలు అనేకం ఉన్నయి.

తెలిపారు. ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది, వత్తిడి తేచ్చే బాధ్యత ముఖ్యమంత్రిగా నీది. దీనికి ఎంత సౌండ్ చేయడం ఎందుకుని ఆయన అన్నారు.