Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తుపై తేల్చేసిన రఘువీరా

 ఏపీ రాష్ట్రంలో టీడీపీతో పొత్తుపై మరో వారం రోజుల్లో  స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ విషయమై ఏపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గురువారం నాడు రాహుల్ గాంధీతో చర్చించారు. 

congress plans to alliance with tdp in ap elections
Author
Andhra Pradesh, First Published Jan 3, 2019, 7:41 PM IST

అమరావతి: ఏపీ రాష్ట్రంలో టీడీపీతో పొత్తుపై మరో వారం రోజుల్లో  స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ విషయమై ఏపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గురువారం నాడు రాహుల్ గాంధీతో చర్చించారు. తమ అభిప్రాయాలను రాహుల్ కు వివరించారు. టీడీపీతో పొత్తును కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

దేశంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో  ఈ రెండు పార్టీలకు ఏ మాత్రం ప్రయోజనం కలగలేదు.

అయితే ఏపీ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయం మరోసారి తెర మీదికి వచ్చింది. ఏపీలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లతో  పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టీడీపీతో పొత్తు విషయమై సమాచారాన్ని సేకరించారు.

కొందరు నేతలు టీడీపీతో పొత్తును స్వాగతిస్తే మరికొందరు ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడ దక్కలేదు.  పోటీ చేసేందుకు కూడ అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

అయితే 2019 ఎన్నికల నాటికి దేశ రాజకీయాల్లో చోటు చేసుకొన్న పరిణామాలు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నాయి. టీడీపీ బీజేపీకి గుడ్‌బై చెప్పింది. బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుకు బాబు ప్రయత్నాలను ప్రారంభించారు.

తెలంగాణ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినా కూడ టీడీపీకి ఆశించిన ప్రయోజం దక్కలేదు. ఏపీ రాష్ట్రంలో కూడ  టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 

ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు  టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొందరు మాత్రం ఈ పొత్తును స్వాగతించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

టీడీపీతో పొత్తు కారణంగా  ఈ దఫా అసెంబ్లీలో సీట్లు దక్కించుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై  రాహుల్ గాంధీతో  ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించారు.  అయితే పొత్తుపై వారం రోజుల్లో స్పష్టత రానుందని  కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

టీడీపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ కాకుండా మరే పార్టీతోనైనా పొత్తు పెట్టుకొనే అవకాశం ఉంటుందా అనే విషయమై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు.

టీడీపీతో పొత్తు పెట్టుకొంటే కనీసం 100 అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను అడగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.పొత్తులపై  కాంగ్రెస్ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.

2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్దంగా ఉన్నారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెప్పారు. వారం రోజుల్లో టీడీపీతో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


సంబంధిత వార్తలు

ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు?: రాహుల్‌తో కీలక భేటి

Follow Us:
Download App:
  • android
  • ios