ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ పెద్ద జోక్ చేస్తుంది. ప్రత్యేక హోదా ఇస్తామన్నా తులసీ రెడ్డి తమకి అధికారం వస్తే మూడు నెలల్లో ప్రత్యేక హోదా.

కాంగ్రెస్ పార్టీ జ‌నాల‌ను పిచ్చోళ్ల‌నుకుంటున్న‌ట్లుంది, ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి తుల‌సీ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలానే అనిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్ప‌గిస్తే ప్ర‌త్యేక హోదా సాధిస్తార‌ట‌. ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ను చూసి జ‌నాలు న‌వ్వుకుంటున్నారు


మంగ‌ళ‌వారం తుల‌సీ రెడ్డి మీడియా తో మాట్లాడుతు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అధికారం అప్ప‌గిస్తే మూడు నెల‌ల్లో ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం, అయితే ఎలా సాధిస్తారో మాత్రం చెప్ప‌లేదు. రాష్ట్రంలో అధికారంలో కి వ‌చ్చినంత మాత్రాన ఏ పార్టీ కూడా ప్ర‌త్యేక హోదా లేద‌న్న విష‌యం అందరికి తెలిసిందే, ఎందుకంటే ప‌త్యేక హోదా ఇవ్వ‌డం, లేదా ఇవ్వ‌క‌పోవ‌డం కేంద్రం పరిధిలోని అంశం. ఈ విష‌యం రాష్ట్రంలో ఎవ‌రిని అడిగిన చెబుతారు. ద‌శాబ్దాలు త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో ఉన్న తుల‌సీ రెడ్డి ఏదో గాలివాటంగా నోటికొచ్చింది చెప్పిన‌ట్లుంది.

ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేది లేదు, వాళ్లు ప్ర‌త్యేక హోదా సాధించేది లేదు. ఈ విష‌యం ప్ర‌క‌ట‌న చేసిన తుల‌సీ రెడ్డి తో పాటు ప్ర‌తి ఒక్క‌రికి తెల‌సు. అందుకే రెడ్డి జ‌నాల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు ప్ర‌స్తుత రాష్ట్రం అధోగ‌తి పాలైందంటే ఆ రోజు ఆధికారం లో కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపి, టీడిపీలే. అధికారంలోకి వ‌చ్చిన ఎండిఏ ప్రధాని న‌రేంద్ర‌మోడీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం ఇష్టం లేదు కాబ‌ట్టే, చంద్ర‌బాబు నాయుడు కూడా ఎమీ చేయ్య‌లేక మాట్లాడ‌కుండా కూర్చున్నారు. ఈ విష‌యం తుల‌సీ రెడ్డి కూడా తెలుసు. అయినా ప్ర‌త్యేకించి ఇప్పుడు ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతున్నారంటే కేవ‌లం నంద్యాల ఉప ఎన్నిక‌లు దృష్టిలో ప‌ట్టుకొనే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా వ‌ల‌న క‌ల్గిన‌ గాయం గురించి ప్ర‌జ‌లు మ‌రిచిపోతున్నారు. ఇప్పుడు మ‌రోసారీ ఆంధ్ర‌కు ప్ర‌త్యేక హోదా అంటు కాంగ్రెస్ నాయ‌కుడు తుల‌సీ రెడ్డి నూత‌న నాట‌కానికి తెర లేపారు కాంగ్రెస్ పార్టీని 2019 ఎన్నిక‌ల్లో గెలిపిస్తే మూడు నెల‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఆయ‌న మంగ‌ళ‌వారం నంద్యాల ప్ర‌చారంలో పాల్గోన్నారు.

మ‌రీ తుల‌సీ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల పై ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.