అమరావతి: అమరావతికే కాంగ్రెస్ జై కొట్టింది. రాజధాని మార్పును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక్క రాజధానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. మూడు రాజధానులపై తమ అభిప్రాయాలను ఏపీ హైకోర్టు కోరింది. రాజకీయపార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాలని ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఒక్క రాజధానికే కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించింది. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మూడు రాజధానులతో వందల కోట్లు  దుర్వినియోగం అవతున్నాయని ఆ పార్టీ అభిప్రాయపడింది.  రాజధాని మార్పను వ్యతిరేకిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదికి తీసుకొచ్చింది. మూడు రాజధానుల ప్రతిపాదనలను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.