Asianet News TeluguAsianet News Telugu

కిడ్నాప్ కేసు: పరిటాల శ్రీరామ్ కు కండీషనల్ బెయిల్

ఓ కిడ్నాప్ కేసులో పరిటాల శ్రీరామ్, ఇతర నిందితులు అనంతపురం జిల్లాలోని రామగిరి పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు. పరిటాల శ్రీరామ్ తో పాటు ఇతర నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజురైంది.

Conditional bail sanctioned to Paritala Sriram in kidnap case
Author
Ananthapuram, First Published Aug 1, 2020, 10:13 AM IST

అనంతపురం: మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత తనయుడు, రాప్తాడు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఓ కేసు విషయంలో రామగిరి పోలీసు స్టేషన్ లో శుక్రవారం హాజరయ్యారు. రామగిరి సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ నాగస్వామి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. 

2018 ఫిబ్రవరి 7వ తేదీన రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి నసనకోట గ్రామంలో పర్యటించి, సూర్యంతో పాటు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వగ్రామంలో ఉన్న సూర్యంను పరిటాల శ్రీరామ్ తన అనుచరులోత వైసిపీకి మద్దతు తెలియజేస్తున్నాడనే కారణంతో కిడ్పాప్ చేశారు. నాలుగు రోజుల సూర్యంపై విచక్షణారహితంగా దాడి చేశారు.

తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు అప్పట్లో రామగిరి పోలీసు స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నసనకోట సూర్యం అనంతపురం వెల్లి జిల్లా ఎస్పీకి పరిటాల శ్రీరామ్ పై ఫిర్యాదు చేశారు. దాంతో పరిటాల శ్రీరామ్ తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశారు. 

ఆ కేసు అప్పటి నుంచి పెండింగులో ఉంది. దాంతో బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు పునర్విచారణను చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ముందస్తు బెయిల్ తీసుకుని రామగిరి పోలీసు స్టేషన్ లో హాజరయ్యారు. ప్రతి మంగళ, శుక్రవారాలు నిందితులు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని రామగిరి పోలీసులు షరతు పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios