మంగళగిరిలో భారీ స్కామ్.. ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ. 1.12 కోట్లు దారి మళ్లింపు..!!
గుంటూరు జిల్లా మంగళగిరిలో సీఎంఎస్ సంస్థ సిబ్బంది ఘరానా మోసం వెలుగుచూసింది. దాదాపు కోటి 12 లక్షల బ్యాంకు సొమ్మును సీఎంఎస్ సంస్థ సిబ్బంది స్వాహా చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో సీఎంఎస్ సంస్థ సిబ్బంది ఘరానా మోసం వెలుగుచూసింది. దాదాపు కోటి 12 లక్షల బ్యాంకు సొమ్మును సీఎంఎస్ సంస్థ సిబ్బంది స్వాహా చేశారు. వివరాలు.. సీఎంఎస్ సంస్థ పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేస్తుంది. అయితే అందులో పనిచేస్తున్న కొందరు.. బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేయకుండా దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. అయితే దాదాపు కోటి 12 లక్షల నగదుకు సంబంధించి తేడా రావడంతో.. క్యాష్ జమచేసే సిబ్బందిపై యాజమాన్యం ఫిర్యాదు చేసింది.
దీంతో ఈ భారీ స్కామ్ వెలుగుచూసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్‌కు పాల్పడ్డ ప్రధాన సూత్రధారుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.