ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు మూడు వేలకు దగ్గరలో ఉన్నాయి. ఇక ఏపీలోనూ పరిస్థితి అదేవిధంగా ఉంది. కేవలం రెండు, మూడు రోజుల్లోనే.. వందల సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయి. ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

ALso Read కరోనాతో హిందూపురంవాసి మృతి: ఏపీలో రెండుకు చేరిన మరణాల సంఖ్య...

అయితే... కరోనా రోగుల కోసం వైద్యాధికారులు మాత్రం బాగానే కష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా...క‌రోనా లాక్‌డౌన్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆర్థిక ప‌రిస్థితి అంత ఆశాజ‌నంగా లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రెండు విడ‌త‌ల్లో వేత‌నాలు చెల్లించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణంయించింది. 

అయితే.. సడెన్ గా  సీఎం జ‌గ‌న్ ఊహించ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డిలో కీల‌క పాత్ర వ‌హిస్తోన్న వైద్య ఆరోగ్య‌, శానిట‌రీ, పోలీస్ సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ప్రాణాల‌కు తెగించి పోరాడుతోన్న వారి జీతాల‌ను వాయిదా వేయ‌డం స‌రికాద‌ని సీఎం జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

 రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా…వారి చేస్తోన్న సేవ‌లు గొప్ప‌వ‌ని..అందుకే మొత్తం జీతాలు చెల్లించాల‌ని సీఎం సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.