New Year Celebrations: తెలుగువారికి ప్రముఖుల శుభాకాంక్షలు

New Year Celebrations: నూతన సంవత్సరం 2024లోకి అడుగుపెడుతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు వారికి సీఎం వైఎస్‌ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని సీఎం జగన్‌ కోరుకున్నారు. 

CM Jagan Wishes Happiness for All Telugus in New Year KRJ

New Year Celebrations: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024లో ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. కాగా, సీఎం జగన్‌.."అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు  ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఇల్లు ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్ అన్నారు.

2023లో ఏపీ ప్రజలు వ్యక్తిగతంగా నరకాన్ని చవిచూశారని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. " కొత్త సంవత్సరంలో కొత్త విశ్వాసంతో...  అవినీతికి, అశాంతికి, అక్రమాలకు చోటులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేసేందుకు సంకల్పిద్దాం. మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకుందాం. ప్రతి తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి... పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదాం. కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ... మరోసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అసమర్థ వ్యక్తికి అధికారం దక్కే అవకాశం ఇచ్చినప్పుడు రాష్ట్రం ఎలా నష్టపోయిందో మనందరికీ అనుభవంలోకి వచ్చింది". అని అన్నారు. 

జనసేన పార్టీ అధినేత కె.పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. "కొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.. గత అనుభవాలతో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలి. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్రానికి ఒక మలుపుగా, ప్రగతికి నాంది పలకాలి. ప్రజా నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. 2024వ సంవత్సరం అందరికీ కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెస్తుందని ఆశిస్తున్నాను."అని పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన పలువురు నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios