Asianet News TeluguAsianet News Telugu

అంబులెన్స్ కు దారిచ్చేందుకు కాన్వాయ్ ను ఆపిన సీఎం జగన్.. కృతజ్ఞతలు తెలిపిన రోగి బంధువులు

నెల్లూరు జిల్లాలో బుధవారం ఏపీ సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోకుండా సీఎం జగన్ తన కాన్వాయ్ ను నిలిపివేశారు. అంబులెన్స్ సులభంగా వెళ్లేందుకు దారి ఇచ్చారు. 

CM Jagan stopped the convoy to give way to the ambulance. The patient's relatives thanked him
Author
First Published Dec 1, 2022, 11:24 AM IST

ఏపీ సీఎం జగన్ మానవత్వాన్ని చాటుకున్నారు. భద్రతాపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఓ ప్రాణాన్ని కాపాడేందుకు తన కాన్వాయ్ ను నిలిపివేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మాదిరిగానే అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ఈ పరిణామం నెల్లూరు జిల్లాలోని మదనపల్లె వద్ద చోటు చేసుకుంది.

జల్లికట్టుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు బుధవారం వచ్చారు. అయితే హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుకోవాల్సి ఉంది. ఈ సమయంలో మదనపల్లె వరకు చేరుకునే సరికి ఓ అంబులెన్స్ అటుగా వస్తోంది. దీనిని గమనించిన సీఎం జగన్ అంబులెన్స్ కు దారి ఇచ్చేలా చూడాలని సిబ్బందికి సూచించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో తన కాన్వాయ్ ను కొద్ది సేపు పక్కన నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో సులువుగా ఆ అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. రోగి బంధువులు దీనిని గమనించారు. చేతులు జోడించి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

నేను ఎక్కడికీ వెళ్లలేదు.. సీబీఐ నోటీసులు ఇస్తే సమాధానం చెబుతాను: బొంతు రామ్మోహన్

ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే తరహాలో నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని చంబి వద్ద తన కాన్వాయ్ ను ఆపారు. అంబులెన్స్ వేగంగా హాస్పిటల్ కు వెళ్తుండగా ప్రధాని కాన్వాయ్ ఆగుతున్న వీడియోను అధికార బీజేపీ ఆ సమయంలో ట్వీట్ చేసింది. ప్రధానమంత్రి తనను తాను ‘‘ప్రధాన్ సేవక్ అని సరిగ్గా పిలుచుకుంటారు’’ అని పార్టీ పేర్కొంది. అంబులెన్స్ లకు ఎప్పుడూ దారి ఇవ్వాలని, విలువైన ప్రాణాలను కాపాడాలని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బీజేపీ ప్రజలను కోరింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి అతిపెద్ద జిల్లా అయిన కాంగ్రా కు వెళ్లినప్పుడు ఇది చోటు చేసుకుంది.

కాగా.. బుధవారం నెల్లూరు జిల్లాలో స్థానిక విద్యార్థులకు ఎక్సలెన్స్ అవార్డ్స్-2022ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రదానం చేశారు. స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) తొలిసారిగా ప్రకటించిన ఈ అవార్డులు మూడు కేటగిరీల్లో అందజేశారు. విద్యార్థులు సామాజిక సేవ చేపట్టేలా ప్రోత్సహించడమే వీటి లక్ష్యంగా. ఇందులో భాగంగా ప్రతీ కేటగిరీలో మొదటి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.60వేలు, మూడో బహుమతిగా రూ.30వేలు, నాలుగో బహుమతిగా రూ.10వేలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ హేమ చంద్రారెడ్డి హాజరయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios