లండన్ పర్యటన ముగించుకుని..విజయవాడ చేరుకున్న సీఎం జగన్..
లండన్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ చేరుకున్నారు. మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్నారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ లండన్ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్నారు. ఆయనకు మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. నేడు జగన్ రాష్ట్రంలోని పరిస్థితులు, శాంతిభద్రతల మీద సమీక్ష నిర్వహించనున్నారు. రేపు బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో వైయస్ జగన్ రెండు రోజుల తర్వాత రాష్ట్రంలోకి అడుగుపెట్టడంతో ఉత్కంఠ నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున కృష్ణాజిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు సీఎం జగన్ దంపతులు. ఆయనకు ఎయిర్పోర్టు వద్దే మంత్రులు, సిఎస్, డిజిపి ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు ప్రజలు దారిపొడుగున ఘన స్వాగతం పలికారు.