విజయవాడ బస్సు ప్రమాదం పై సీఎం జగన్ విచారం.. మృతులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా...
విజయవాడ బస్సు ప్రమాదంలో కండక్టర్ తో పాటు ఓ మహిళ, సంవత్సరంన్నర చిన్నారి మృతి చెందారు.

విజయవాడ : విజయవాడ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆ కుటుంబాలకు అందించాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు.
కాగా, ఈ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు పూర్తి చికిత్స తామే బాధ్యత వహిస్తామని తెలిపారు. ప్రమాదం ఉదయం పూట కావడంతో ఎక్కువమంది లేరని.. అదే సాయంత్రం జరిగి ఉంటే తీవ్రత ఎక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు.
వైఎస్ఆర్ రైతు భరోసా : రేపే 53.53 లక్షలమంది ఖాతాల్లో రెండో విడత నగదు జమ...
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. బస్సు రివర్స్ గేరుకు బదులు.. ఫస్ట్ గేర్ వేయడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా తెల్చారు. కాగా ఈ ప్రమాదం మీద డ్రైవర్ మాట్లాడుతూ.. గేర్ స్ట్రక్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో సోమవారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్ లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కండక్టర్, ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. ప్లాట్ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏపీ సర్వీసు మెట్రో లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లింది.
డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని డిపో ఆర్ఎం చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు, రెండున్నరేళ్ల బాబు.. ముగ్గురు మృతి చెందారు. బస్సు ప్రయాణికుల మీదికి దూసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.