ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన కొసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగినట్టుగా తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన కొసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం సాగినట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ఈ సమావేశం సందర్భంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని కోరిన సీఎం జగన్ కోరినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని తర్వితగతిన ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టుగా పేర్కొన్నాయి. అలాగే ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించినట్టుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మధ్యాహ్నం 12.30 గంటకు సీఎం జగన్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. మధ్యామ్నం 1.30 గంటలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో సమావేశం కానున్నారు. ఇక, అపాయింట్‌మెంట్‌లను అనుసరించి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరమైతే సీఎం జగన్ నేడు కూడా ఢిల్లీలోనే బస చేసే అవకాశం ఉంది. 


ప్రధానితో భేటీ కోసం సీఎం జగన్ ఆదివారం సాయంత్రం తాడేపల్లి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం జగన్ బస చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సీఎం జగన్.. ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ అజెండా కూడా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.