"45 రోజులు.. టార్గెట్ 175..": 'మేం సిద్ధం-మా బూత్ సిద్ధం' పేరిట కార్యకర్తలకు కర్తవ్య బోధ
CM Jagan : క్షేత్రస్థాయి నుంచి వైసీపీ బలంగా ఉందని, చేసిన మంచి పనులే మనకు అండ... ఆ ధైర్యంతోనే ప్రజల్లోకి వెళ్లండి... మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించండని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు. రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
CM Jagan : రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 స్థానాలను గెలిపించాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన సామర్థ్యంతో తాను చేయగలిగినదంతా చేశాననీ, ఇప్పుడు తమరి వంతు. అందరూ గెలవాలని కోరుకుంటున్నాననీ, పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్లండని , మనం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి అని కర్తవ్య బోధ చేశారు. మన లక్ష్యం 175/175 అని గుర్తుంచుకోండని మంగళగిరిలో మంగళవారం జరిగిన సన్నాహక సమావేశంలో సీఎం జగన్ పేర్కొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు ఓటర్లకు బంగారు రుణాలు, రైతుల రుణమాఫీ అంటూ వాగ్దానం చేయడం తాను చూసిన చెత్త ప్రకటన అని ముఖ్యమంత్రి అన్నారు. “అన్నీ అబద్ధాలు. అది ఎలా సాధ్యమో తెలియక నాయుడు ఈ వాగ్దానాలన్నీ చేశాడు. మేము అలా చేయము. ఏం చెబితే అది చేస్తాం” అన్నాడు.
టీడీపీ వెబ్‌సైట్‌లో వారి మేనిఫెస్టో కనిపించకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. మేనిఫెస్టో లేనప్పుడు పార్టీ ప్రజలకు ఏమి చేసిందో క్యాడర్ ఎలా వివరిస్తారని ప్రశ్నించారు. 'తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందుకే అధికారంలోకి వచ్చాననీ, ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేశారని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాము అనే దాని గురించి క్షేత్రస్థాయిలో ప్రజలతో చర్చించాలని కార్యకర్తలకు సూచించారు. కుప్పంలో 93.29 శాతంతో సహా 87 శాతం కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని వైఎస్ జగన్ చెప్పారు. “ఈ ఎన్నికలు కుల పోరు కాదు, వర్గ పోరు. జగన్ ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, వైఎస్సార్‌సీపీకి ఓటేయకపోతే సంక్షేమం ఆగిపోతుందని మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు.
పార్టీ మేనిఫెస్టోను పవిత్ర బైబిల్‌గా అభివర్ణించిన ఆయన, అందుకు భిన్నంగా టీడీపీ తమ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయాల్సిన చెత్త పేపర్‌గా పరిగణిస్తోందన్నారు. “ఇదంతా విశ్వాసానికి సంబంధించినది. జగన్ చెబితే చేస్తానన్నారు. ఆలోచించిన తర్వాతే జగన్ వాగ్దానాలు చేస్తారు. నాయుడులా కాదు,” అన్నారాయన. సంఘటితంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఆయన ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నాయకులందరూ తమ బూత్ సామర్థ్యాన్ని, నిర్మాణాన్ని అంచనా వేయాలని పిలుపునిచ్చారు. విశ్వసనీయమైన వ్యక్తిని నియమించాలని సూచించారు. వాలంటీర్లు, 'గృహ సారథి'లతో ట్యాగ్ చేసి తమ బృందాన్ని తయారు చేయాలని కూడా ఆయన వారిని కోరారు. ఒక్కో బూత్ టీమ్‌లో 15-18 మంది సభ్యులుండాలని తెలిపారు.