అమరావతి: సినిమా బాగా తీశారన్నా అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సినీ నటుడు చిరంజీవిని అభినందించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను సినీ నటుడు చిరంజీవి సోమవారం నాడు అమరావతిలో కలిశారు. సైరా సినిమా చూడాలని  సీఎం జగన్ ను సినీ నటుడు  చిరంజీవి ఆహ్వానించారు.

రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి చిరంజీవి దంపతులు జగన్ నివాసానికి చేరుకొన్నారు. ఈ సమయంలో  జగన్  దంపతులు తన నివాసం వద్ద చిరంజీవి దంపతులను సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ కు సైరా సినిమా విశేసాలను చిరంజీవి వివరించారు.

సినిమా తీసేందుకు  ఎలా కష్టపడింది, సినిమా తీసే సమయంలో చోటు చేసుకొన్న ఘటనలను చిరంజీవి సీఎం జగన్ కు వివరించారు. కథ వినగానే తాను ఎలా ఫీలయ్యాడో కూడ సీఎం జగన్ కు వివరించినట్టుగా సమాచారం.

చారిత్రాత్మకమైన సైరా నరసింహారెడ్డి  సినిమాను చూడాలని జగన్  దంపతులను చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్  సతీమణి భారతికి చిరంజీవి సతీమణి సురేఖ చీరను బహుకరించారు.

చిరంజీవి దంపతులు సీఎం వైఎస్ జగన్ దంపతులు కలిసి భోజనం చేశారు. భోజనం చేసే సమయంలో సైరా సినిమా గురించి సీఎం వైఎస్ జగన్, చిరంజీవి మధ్య చర్చ జరిగింది.

సుమారు గంట పాటు సీఎం జగన్, చిరంజీవి మధ్య  చర్చలు జరిగాయి. రెండు మూడు రోజుల్లో విజయవాడలోని పీవీపీ నిసిమా హల్‌లో  సీఎం వైఎస్ జగన్  సైరా సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ఈ సినిమాను వీక్షించాలని చిరంజీవి ఇచ్చిన  ఆహ్వానం మేరకు జగన్ సానుకూలంగా స్పందించారు.

గంట పాటు జరిగిన ఈ సమావేశంలో రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  సైరా సినిమా గురించే వీరిద్దరి మధ్య చర్చ జరిగిందంటున్నారు.

మరోవైపు హైద్రాబాద్‌కే పరిమితమైన సినీ పరిశ్రమను ఏపీ రాష్ట్రానికి తరలించే విషయమై కూడ సీఎం జగన్ చిరంజీవితో చర్చించినట్టుగా సమాచారం. ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసే విషయమై చర్చించినట్టుగా సమాచారం. అయితే ఈ విషయమై ఇంకా స్పస్టత రావాల్సి ఉంది.

ఈ వార్తలు చదవండి
సైరా: అమరావతిలో జగన్‌తో చిరంజీవి భేటీ

అందరి చూపు వారిపైనే: జగన్‌తో చిరంజీవి భేటీ

సైరా: జగన్‌తో చిరంజీవి భేటీ (ఫోటోలు) ...