అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ తో  సినీ నటుడు చిరంజీవి సోమవారం నాడు మధ్యాహ్నం భేటీ అయ్యారు.సైరా సినిమాను వీక్షించాలని  సీఎం జగన్ ను చిరంజీవి కోరారు.

చిరంజీవి నటించిన సైరా సినిమా  పలు భాసల్లో విడుదలై  విజయవంతంగా ప్రదర్శింపడుతోంది. కర్నూల్ జిల్లాకు చెందిన  నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈ పోరాటం ఆధారంగా  ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమా అంచనాలకు మించి ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాను వీక్షించాలని సీఎం జగన్ ను నటుడు చిరంజీవి సోమవారం నాడు ఆహ్వానించారు. తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి సోమవారం నాడు విమానంలో గన్నవరం చేరుకొన్నారు.  అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గం ద్వారా అమరావతికి చేరుకొన్నారు.

కొద్దిసేపటి క్రితమే ఏపీ .సీఎం జగన్ తో చిరంజీవి భేటీ అయ్యారు. తన నివాసం వద్ద చిరంజీవి దంపతులను ఏపీ సీఎం జగన్ దంపతులు  ఆహ్వానించారు. జగన్ ను చిరంజీవి శాలువా కప్పి సన్మానించారు. 

సైరా నరసింహారెడ్డి సినిమాను చూడాలని ఆయన జగన్ ను కోరారు. ఇటీవలనే తెలంగాణ గవర్నర్ సౌందర రాజన్ ను సైరా ప్రత్యేక షో ను చూపించారు. ఈ సినిమా చూసిన గవర్నర్ చిరంజీవితో పాటు సినిమా యూనిట్ ను అభినందించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో చిరంజీవి, వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పీఆర్పీని  కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత  చిరంజీవికి కాంగ్రెస్ కేంద్ర మంత్రి పదవిని కేటాయించింది.

ఆనాడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ కాంగ్రెస్ ను వీడి వైసీపీని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ తరపున చిరంజీవి ఎన్నికల ప్రచారాన్ని  నిర్వహించారు. ఆ సమయంలో జగన్ అనుచరులు చిరంజీవిపై కోడిగుడ్లతో కూడ దాడి చేశారు.

2014 ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజనను చిరంజీవి వ్యతిరేకించారు.ఆనాటి నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో రెండు సినిమాల్లో నటించేందుకు చిరంజీవి అగ్రిమెంట్ చేసుకొన్నారని సమాచారం.

సైరా: జగన్‌తో చిరంజీవి భేటీ (ఫోటోలు) ...