స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి.. ప్రధానికి చంద్రబాబు లేఖ

First Published 20, Jun 2018, 6:37 PM IST
CM Chandrababu Addressing a letter to PM Modi
Highlights

స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేయండి.. ప్రధానికి చంద్రబాబు లేఖ

కడపలో స్టీల్ ప్లాంట్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.. కడపలో ఉక్కు కార్మగారం ఏర్పాటు చేయాలంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగాడు.. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం ప్రధాని మోడీకి లేఖ రాశారు.. స్టీల్ ప్లాంట్‌కు అనుగుణంగా సుప్రీంలో రివైజ్డ్ అఫిడవిట్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల గురించి మెకాన్ ఇచ్చిన తాజా నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని.. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
 

loader