కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీలో మరోసారి నేతల మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఇళ్ల పట్టాల పంపిణీ వేదిగ్గా.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య వివాదం చెలరేగింది.

ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుండగా యార్లగడ్డ, వల్లభనేని అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. నినాదాలు కాస్తా తోపులాటకు దారి తీసింది. వంశీ వైసీపీకి దగ్గరయ్యాక, ఈ గొడవలు బాగా ముదిరాయి.

నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా వంశీ, యార్లగడ్డ అనుచరుల మధ్య ఘర్షణ జరుగుతోంది. వీరి మధ్య సయోధ్య కుదర్చాలని భావించింది అధిష్టానం. దీనిలో భాగంగా ఓ కార్యక్రమానికి వెళ్లిన సీఎం జగన్.. వంశీని, యార్లగడ్డని పిలిపించుకున్నారు.

ఆయన సమక్షంలోనే ఇద్దరు నేతలు మధ్య చేతులు కలుపుకున్నారు. వివాదం సర్దుమణిగింది అనుకునేలోపే మళ్లీ ఇళ్ల పట్టాల పంపిణీ వేదిగ్గా, వివాదం చెలరేగింది.