ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడులో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడులో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. ఎనికెపాడులో విద్యార్థులు సాయి, కార్తీక్‌ల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. ఈ క్రమంలోనే కార్తీక్ కత్తితో సాయిపై దాడి చేశాడు. కత్తితో సాయి పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సాయిని.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం సాయి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏమిటి?, ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. 

మరోవైపు విద్యార్థుల మధ్య గొడవకు అమ్మాయి విషయమే కారణమనే ప్రచారం సాగుతుంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనపై సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.