తన చిన్నతనం ఇక్కడే గడిచిందని, కులాలు, మతాలకతీతంగా జీవనం సాగించేవారమని సుప్రీంకోర్ట్ (supreme court) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (justice nv ramana) అన్నారు. తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా (krishna district) పొన్నవరంలో (ponnavaram) ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో శుక్రవారం ఆయన పాల్గొని ప్రసంగించారు
తన చిన్నతనం ఇక్కడే గడిచిందని, కులాలు, మతాలకతీతంగా జీవనం సాగించేవారమని సుప్రీంకోర్ట్ (supreme court) చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (justice nv ramana) అన్నారు. తన స్వగ్రామమైన కృష్ణాజిల్లా (krishna district) పొన్నవరంలో (ponnavaram) ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో శుక్రవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. పొన్నవరం, కంచికచర్ల లోనే తన ప్రాధమిక విద్య కొనసాగిందని జస్టిస్ ఎన్వీరమణ గుర్తుచేసుకున్నారు. 1960వ దశకంలోనే రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం పొన్నవరం అని ఆయన ప్రశంసించారు. తెలుగు జాతి అంతా ఒక్కటిగా ఉండాలని .. కష్టపడే తత్వం ఉన్న తెలుగు వాళ్లు ప్రపంచ దేశాల్లోనూ పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నారని ఎన్వీ రమణ కొనియాడారు. తన చిన్ననాటి మిత్రులను కలవడం సంతోషంగా ఉందని.. ప్రజలంతా ఐక్యంగా ఉండి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.
అంతకుముందు సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.. సీజే దంపతులను ఎడ్ల బండిపై ఊరేగింపుగా మేళతాళాలతో గ్రామంలోకి తీసుకెళ్లారు. పొన్నవరంలోని శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజుల పాటూ ఏపీలో జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించనున్నారు.
ALso Read:కోర్టుల్లో మౌళిక వసతులకు ప్రభుత్వాలు కృషి చేయాలి: వరంగల్‌లో సీజేఐ ఎన్వీ రమణ
పొన్నవరంలో పర్యటన ముగించుకుని సీజేఐ మధ్యాహ్నం విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి గుంటూరు జిల్లా పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నివాసానికి వెళతారు. అనంతరం రాత్రికి విజయవాడ చేరుకుని నోవాటెల్‌లో బస చేస్తారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరవుతారు. ఆ తర్వాత సిద్ధార్థ అకాడమీలో రోటరీ క్లబ్‌లో పౌర సన్మానం స్వీకరిస్తారు.. అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే విందుకు హాజరవుతారు.
ఆదివారం సీజేఐ విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో (siddhartha engg college ) జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం గుంటూరులోని నాగార్జున విశ్వ విద్యాలయంలో జరిగే జ్యుడిషీయల్ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో పాల్గొంటారు. మధ్యాహ్నం హైకోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమానికి వెళతారు. తర్వాత రాత్రికి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరతారు.
